'టైగర్ నాగేశ్వరరావు' కోసం రంగంలోకి దిగుతున్న ఐదుగురు స్టార్స్!

  • 'టైగర్ నాగేశ్వరరావు'గా రవితేజ 
  • కథానాయికగా నుపుర్ సనన్ పరిచయం 
  • ఈ నెల 24వ తేదీన ఫస్టులుక్ రిలీజ్ 
  • అక్టోబర్ 20న సినిమా విడుదల  
రవితేజ నుంచి ఇటీవల వచ్చిన 'రావణాసుర' సినిమా ఆయన అభిమానులను నిరాశ పరిచింది. రవితేజ మార్క్ కి ఈ సినిమా చాలా దూరంగా వెళ్లిందనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ తరువాత సినిమాగా ఆయన నుంచి రావడానికి 'టైగర్ నాగేశ్వరరావు' రెడీ అవుతోంది. టైటిల్ తోనే ఈ సినిమా ఆసక్తిని రేకెత్తించింది. 

అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాకి వంశీ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ షూటింగు జరుపుకుంది. ఈ సినిమా నుంచి ఈ నెల 24వ తేదీన ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నారు. ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో, ఫస్టు లుక్ నుంచి ఆ రేంజ్ ను చూపించనున్నారు. 

ఇటు సౌత్ .. అటు నార్త్ నుంచి ఐదుగురు సీనియర్ స్టార్ హీరోలతో ఫస్టులుక్ ను రిలీజ్ చేయించనున్నట్టు చెప్పారు. హిందీలో సల్మాన్ .. తమిళంలో రజనీ .. మలయాళంలో మోహన్ లాల్ .. కన్నడలో శివరాజ్ కుమార్ ఈ ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. తెలుగు నుంచి ఏ స్టార్ అనేది తెలియాల్సి ఉంది. నుపుర్ సనన్ కథానాయికగా పరిచయమవుతున్న ఈ సినిమాను, అక్టోబర్ 20వ తేదీన విడుదల చేయనున్నారు.

Raviteja
Nupur Sanon
Tiger Nageshwara Rao

More Telugu News